సురక్షిత నీటి కరువు
- ధనిక దేశాల్లో పేదల స్థితి
- ఐరాస నిపుణురాలి వెల్లడి
ఈ విధానాలు పేద వర్గాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. వాతావరణ మార్పు, కొరత ఉన్న వనరులకు డిమాండ్ పెరగడంతో రానున్న సంవత్సరాల్లో అమెరికాలో ఈ వివక్ష సమస్య మంచినీరు, శానిటేషన్‌కు సంబంధించి తీవ్రతరం కావచ్చని ఆమె తెలిపారు. ఈ సమస్యపై అంతర్జాతీయ ఒప్పందాలను ఆమోదించాల్సిందిగా అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎలాంటి వివక్షా లేకుండా సురక్షితమైన నీరు, శానిటేషన్ హక్కును అందరికీ గ్యారంటీ ఇచ్చే సమగ్ర ఫెడరల్ చట్టాన్ని ఆమోదించాల్సిందిగా ఆమె కోరారు. ఇళ్ళులేని ప్రజలకు సురక్షిత నీరు, శానిటేషన్‌ను అన్ని మున్సిపాలిటీలూ అందించేలా హామీనివ్వాలని పేర్కొన్నారు. జపాన్‌కు సంబంధించి తెలుపుతూ అత్యధిక జనాభాకు సురక్షిత నీరు, శానిటేషన్ అందుబాటులో ఉండేలా చూస్తున్నందుకు అల్బూక్వెర్క్ ప్రశంసించారు. అయితే మైనారిటీ గ్రూపులు లేదా ఇతరత్రా పేద ప్రజల అవసరాల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరమున్నట్లు ఆమె తెలిపారు. ఇళ్ళు లేనివారు, మైనారిటీలు, వికలాంగులైన వ్యక్తుల పట్ల వివక్షను తొలగించేందుకు ఒక సమగ్ర చట్టాన్ని ఆమోదించాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆమె క్యోటోలోని ఓ 90 ఏళ్ళ మహిళ ఉదంతాన్ని ఇక్కడ పేర్కొన్నారు. 'ఆమెకు మురుగునీటి వ్యవస్థ లేదు. ఆమె ఇంటికి గొట్టాల ద్వారా నీరు వచ్చే వసతి లేనందున బావి నుంచే నీరు తెచ్చుకోవలసి వస్తోంది. ఇలా ఎందుకు జరిగింది' అని ఆమె ప్రశ్నించారు. ఆమె కొరియా మైనారిటీ గ్రూపుకు చెంది ఉండటమే అందుకు కారణమని చెప్పారు. వారు నివసిస్తున్న స్థలానికి సంబంధించి న్యాయపరమైన వివాదం ఉండటం కూడా ఈ వివక్షకు కారణమని పేర్కొన్నారు. చుట్టూ ఉన్న మిగతా తెగలన్నింటికీ జపాన్‌లో సాధారణంగా అందుబాటులో ఉన్న విధంగా మంచినీరు, మురుగునీటి వ్యవస్థ అందుబాటులో ఉంది. న్యాయపరమైన వివాదం ఉన్నందున ఈ చిన్న గ్రూపుకు వాటి అందుబాటు లేదని ఆమె చెప్పారు.
స్లోవేనియాలో కూడా ప్రభుత్వం పెద్ద సంఖ్యలో జనాభాకు మంచినీరు, శానిటేషన్‌కు సంబంధించిన మానవహక్కుల బాధ్యతను నిర్వహిస్తోందని తెలిపారు. అయితే అన్ని రోమా తెగల వారికి మాత్రం ఈ హక్కులు అందకపోవడం పట్ల ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. తన కుమార్తె బడికి వెళ్ళనని మొరాయిస్తోందని ఒక వ్యక్తి కన్నీటితో ఆమెకు తెలిపారు. మిగతా పిల్లలు ఆమె దగ్గర వాసన వస్తోందని ఏడ్పించడం వల్ల ఆమె మొండికేస్తున్నట్లు చెప్పారు. 'ఆమె వద్ద వాసన వస్తోందని నాకు తెలుసు. కానీ మాకు నీరు అందుబాటులో లేవు' అని ఆ ఆ వ్యక్తి ఆమెకు తెలిపారు. అయితే ఏం చేస్తావని ప్రశ్నించగా, తన కూతుర్ని పట్టుకుని ఏడవడం మినహా తనకు వేరేమార్గం లేదని ఆయన జవాబిచ్చారని ఆమె చెప్పారు. 'మానవ హక్కులకు సంబంధించి ఎలాంటి వివక్షా లేకుండా అందరికీ సురక్షితమైన నీరు, శానిటేషన్ అందుబాటులో, ఆమోదయోగ్యమైన పద్ధతిలో ఉండాలి. ఈ ప్రాథమిక హక్కులు గ్యారంటీ ఇచ్చేందుకు ప్రభుత్వాలు నిరంతరం చర్యలు తీసుకోవాలి' అని ఆమె తన నివేదికను ముగించారు.
No comments:
Post a Comment