సామాన్యుడి నుండి సెలబ్రేటీల వరకు బ్లాగ్ బ్లాగ్...
సామాన్యుల నుండి సెలబ్రేటీల వరకు నిత్యం తమ భావాలను వెలిబుచ్చడానికి బ్లాగ్‌లను వాడుతున్నారు. అనేక విషయాలపై అందరితో భావాలను పంచుకోవడానికి ఈ బ్లాగ్‌లు ఉపయోగపడుతున్నాయి. 2003లో జరిగిన ఇరాక్ యుద్ధంలో పాల్గన్న సైనికులు యుద్ధ అకృత్యాలను, వారి భావాలను ఈ బ్లాగ్‌లలో వుంచడంతో అమెరికా దుష్ట చర్యలు లోకానికి తెలియవచ్చింది. అలాగే అనేక విషయాలను చర్చించడానికి ఈ బ్లాగ్‌లు ఉపయోగపడుతున్నాయి. మొదట కంప్యూటర్, తరువాత ఇంటర్నెట్, అటు తర్వాత ఈ మెయిల్స్ ఈ వాడకం, ఇప్పుడు బ్లాగ్‌ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. తమకు ఇష్టమొచ్చింది దీనిలో పెట్టుకోవచ్చు. ఒకరికి నచ్చినా, నచ్చకపోయినా పనిలేదు. మంచి చెడులను చర్చించవచ్చు. ఈనాడు వార్తా పత్రికలు, టివీలకన్నా ఈ బ్లాగ్‌లకు ఆదరణ పెరిగింది. నేను ఒక కవిత లేదా కథ వ్రాశాననుకోండి. మాములుగా అయితే దానిని ప్రచురించడానికి ఏ పత్రికకైన పంపాలి. దాని వారు పరిశీలించి ప్రచురణకు యోగ్యమైందో లేదో చూడాలి. యోగ్యమైతే ప్రచురిస్తారు. అనోగ్యమైతే తిప్పి పంపుతారు. ఈ ప్రక్రియ అంతా చాలా కాలం పడుతుంది. అదే బ్లాగ్‌లో అయితే మనము రాసిన వెంటనే పెట్టేయ (పోస్టు) వచ్చు. అందరికీ అందుబాటులో కొద్ది నిముషాలలోనే తీసుకురావచ్చు. అంతటి మహత్తరమైన ప్రక్రియే ఈ బ్లాగ్. అందుకే అనతికాలంలోనే అపరిమితమైన ఆదరణకు నోచుకుంది.
ఒక విధంగా చెప్పాలంటే తెరచిన పుస్తకం. ఎవరైనా చదవచ్చు. తమ అభిప్రాయాలను వెలిబుచ్చవచ్చు. ఇంటర్నెట్ వాడకానికి రాకమునుపు ఎలక్రానిక్ సంభాషణలు, వైర్ సంభాషణలు వుండేవి. అమెచ్యూర్ రేడియోని దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ అమెచ్యూర్ రేడియో యూజర్లు గ్లాగ్ (సైన్‌బోర్గ్‌లాగ్)లు రాసేవారు. ఇవి వ్యక్తిగత డైరీలు. బ్లాగ్ అనే పదం వెబ్‌లాగ్ అనే పదం నుండి వచ్చింది. 1997లో జాన్ బార్జర్ అనే అతను వెబ్‌లాగే అనే పదాన్ని మొట్ట మొదట వాడాడు. వెబ్‌లాగ్ అనే పదాన్ని వె బ్లాగ్ అని పీటర్ మెర్వోల్జ్ తన బ్లాగ్‌లో పెట్టాడు. అలా వెబ్‌లాగ్ పేరు మరుగునపడి బ్లాగ్‌గా వాడకంలోకి వచ్చింది. 1999 సంవత్సరంలో బ్లాగ్ హౌస్టింగ్ కోసం బ్లాగర్ అనే వెబ్‌సైట్ ముందుకొచ్చింది.
బ్లాగ్‌లలో వీడియో బ్లాగ్స్, ఆడియో బ్లాగ్స్, ఫొటో బ్లాగ్స్, మోబ్లాగింగ్స్ వుంటాయి. వీడియో బ్లాగ్స్‌లో మనకు కావలసిన వీడియోలను పెట్టుకోవచ్చు. ఆడియో బ్లాగ్స్‌లో ఆడియోలు వుంచుకోవచ్చు. అలాగే ఫొటో బ్లాగ్స్‌లో మనకు కావలసిన ఫొటోలను పెట్టుకోవచ్చు. మొబైల్ ద్వారా నిర్వహించే బ్లాగ్స్‌ను మోబ్లాగింగ్స్ అంటారు.బ్లాగ్ ఏర్పాటు?
బ్లాగ్‌లను మూడు అంచెలుగా రూపొందించవచ్చు. బ్లాగింగ్ క్లయింట్స్, బ్లాగింగ్ ఫ్లాట్‌ఫారమ్స్, బ్లాగ్ హౌస్ట్. బ్లాగ్ కూడా ఒక వెబ్ పేజీనే. దీనిలో వెబ్ పేజీలో లాగానే అనేకం అప్‌లోడ్ చేసుకోవచ్చు.
బ్లాగింగ్ క్లయింట్స్
బ్లాగింగ్ క్లయింట్స్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌గా లభిస్తాయి. బ్లాగ్.కాంలో ఆన్‌లైన్ బ్లాగ్‌లను తయారుచేసుకోవచ్చు. అన్ని ఫ్లాట్‌ఫారాలతో ఇది మిళితమై వుంటుంది. ప్లాక్‌లాంటివి బ్లాగ్‌ల్లో పోస్ట్ చేయడానికి ఆన్‌లైన్‌లో రూపొందించుకొనే వీలునిస్తాయి. ఇంటర్నెట్‌ను కనెక్ట్‌తో (ఆఫ్‌లైన్‌లో) పనిలేకుండా బ్లాగ్‌లో సమాచారాన్ని రూపొందించవచ్చు. పోస్టు చేయడానికి మాత్రమే ఇంటర్నెట్‌ను ఆన్ చేసుకోవాలి.
బ్లాగింగ్ ఫ్లాట్‌ఫారం బ్లాగ్స్‌ను నిర్మించడానికి ఫ్లాట్‌ఫారమనేది కీలకం. బ్లాగ్‌కు సంబంధించిన విధి విధానాలను దీని ద్వారా చేయవలసి వుంటుంది.
బ్లాగ్ హౌస్ట్మనం తయారు చేసిన సమాచారాన్ని దీని ద్వారా హౌస్ట్ చేయవచ్చు.
ప్రధానంగా పై మూడు బ్లాగింగ్ ప్రధానమైనవి. అవి కాకుండా టెంప్లేట్స్, టెంప్లేట్స్‌లో మార్పులు, లేఅవుట్‌లో మార్పులు, కామెంట్స్, అప్‌లోడింగ్, ట్యాగింగ్ సెర్చ్, ఆర్‌ఎస్‌ఎస్ ఫీడ్స్, పోస్టు చేసుకునేందుకు, కోడ్, బ్లాగ్ ట్రాకర్స్ కూడా వుండేటట్లు చూసుకోవాలి.
బ్లాగ్ టెంప్లేట్స్? బ్లాగ్ ఎలా వుండాలో నిర్దేశించే నమూనా పేజీ. బ్లాగ్ బ్యాక్‌గ్రౌండ్, ఫాంట్ టైప్, కలర్ డెఫినిషన్స్ అనుగుణంగా చూడవచ్చు.
బ్లాగ్ టెక్నికల్ వర్డ్స్
బ్లాగింగ్ : ఏదైనా (ఫొటో, వీడియో, ఆడియో, మ్యాటర్) పోస్టు చేయడం.
బ్లాగర్స్ : పై వాటినే పోస్ట్ చేసే వారినే బ్లాగర్స్.
పోస్టు : మనం దేనినైతే బ్లాగ్ వుంచే దానినే పోస్టు అంటారు.
ఆడియో బ్లాగ్ : ధ్వనితో కూడిన వాటిని వుంచేవి. దీనినే పోడ్కాస్టింగ్ అంటారు.
బ్లెగ్ : చదువురుల నుండి తెలియని విషయాన్ని యాచించడం (అడుక్కోవడం).
విబ్లాగ్ : వీడియో క్లిపింగ్‌లను వుంచేది. దీనినే స్క్రీన్‌కాస్ట్ అంటారు.
బ్లాగ్‌రోల్ : మన బ్లాగ్‌లను ఇతరుల బ్లాగ్‌లకు లింకివ్వడం.
ట్రాక్‌బ్యాక్ : మన బ్లాగ్‌ను ఇతరుల బ్లాగ్ లింక్ చేయడం.
పెర్మాలింక్ : మనకు కావలసిన పోస్ట్‌కి లింక్ చేసి యుఆర్‌ఎల్ ద్వారా సూచించడం.
ఆర్‌ఎస్‌ఎస్ : రిచ్ సైట్ సమ్మరీ (ఆర్‌ఎస్‌ఎస్) అంటే మన బ్లాగ్‌ను ఇతరులకు వేగంగా వచ్చేటట్లు చేయడం.
బ్లాగ్ జంప్ : ఒక బ్లాగ్‌ను మరో బ్లాగ్‌కు జంప్ చేయడం.
బ్లాగ్ సైట్ : బ్లాగ్ వుండే వెబ్‌సైట్.
బ్లాగ్ స్నాబ్ : బ్లాగ్‌పై మీద వారి అభిప్రాయాలకు బదులు ఇవ్వని వారిని బ్లాగ్ స్నాబ్స్ అంటారు.
మోబ్లాగ్ : మొబైల్ బ్లాగింగ్.
కంప్యూటర్ వేగాన్ని కిలోబైట్స్‌లో కొలిచినట్లే సిడి డ్రైవ్ వేగాన్ని 'ఎక్స్'లో కొలుస్తారు
ఇంటర్నెట్ అనేది అనేక నెట్‌ల కలయిక

మీకు ప్రార్థన చేయడానికి కూడా తీరికలేదా? నో ప్రోబ్లమ్ మీ కోసం ఆన్‌లైన్‌లో ప్రార్థనలు చేస్తాం!
మీరు షాపింగ్ చేయడానికి సమయం చిక్కడంలేదా? మీరు ఇంటి దగ్గర నుండే ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి. మీరు కొనుగోలు చేసిన దానిని మీ ఇంటికే చేరుస్తాం!
మీ బిల్లు ఆన్‌లైన్‌లోనే చెల్లించి సమయాన్ని ఆదా చేసుకోంది! ఇలాంటి ప్రకటనలు ప్రతి నిత్యం చూస్తున్నాము. ప్రతిది ఇంటర్నెట్ మయమైంది. ఈరోజు ఇంటర్నెట్ అంటే తెలియని వారుండరు. ఇది నిత్యావసరమై కూర్చొంది. అదే యువత పెడ మార్గానికి కారణమౌతుంది. ఎక్కడ మంచి వుంటుందో, అక్కడే చెడు కూడా వుంటుందంటారు. చెడును వదలి మంచిని స్వీకరించే తత్వాన్నికి యువత దృష్టిని మరల్చవలసిన అవసరం ఎంతైనా వుంది. 
ఇంటర్నెట్ అనేది అనేక నెట్‌ల కలయిక. విభిన్న రకాల కలయికలు భౌతికంగా ఒక దానితో మరొకటి అనుసంధానించబడి ఒకే పరిభాషలో వ్యవహారాలను నడుపుకోవచ్చు. 

ఇంటర్నెట్ అనగానే మనకు ఠక్కున గుర్తు వచ్చేది బ్లాగ్‌లు. వీటికి 1990లోనే టిమ్ బెర్నర్ అనే శాస్త్రవేత్త మరి కొంతమంది శాస్త్రవేత్తలతో కలిసి యూరోపియన్ పార్టికల్ ఫిజిక్స్ లేబరేటరీలో ఇంటర్నెట్ విప్లవానికి నాంది పలికారు. హైపర్ లాంగ్వేజిని వాడి నేడు వాడుతున్న బ్రౌజర్‌ని పోలివుండే బౌజర్‌ను వాడుకలోకి తెచ్చారు.

No comments:
Post a Comment