Popular Posts

Saturday, December 31, 2011

Thursday, December 8, 2011

'ఆక్యుపై వాల్‌స్ట్రీట్‌'. 1 శాతంపై 99 శాతం చేస్తున్నపోరాటం

వాల్‌స్ట్రీట్‌లోని కార్పొరేట్లను కాదు ఆదుకోవలసింది మెయిన్‌స్ట్రీట్‌లోని జనాన్ని అన్నదే ముట్టడి ఉద్యమకారుల ప్రధాన డిమాండ్‌. అమెరికన్లు మన మాదిరి ఎందుకు వీధులకు ఎక్కుతున్నారు అన్నది ఒక ప్రశ్న. న్యూయార్క్‌ నగరంలో 'ఛేజ్‌ మాన్‌హటన్‌' అనే ఒక బ్యా...ంకు ఉంది. సంక్షోభం కారణంగా ఆదుకొమ్మని ప్రభుత్వాన్ని కోరగానే 947 కోట్ల డాలర్ల ప్రభుత్వ(ప్రజల) సొమ్మును ఒబామా సర్కార్‌ అప్పనంగా ఇచ్చింది. ఆ మొత్తాన్ని తీసుకున్న వెంటనే బ్యాంకులో పని చేస్తున్న 14వేల మంది సిబ్బందిని తొలగించివేసింది. కడుపు మండిన సిబ్బంది ఏ పార్టీ, యూనియన్‌తో నిమిత్తం లేకుండా ఇదెక్కడి అన్యాయం మా ఉద్యోగాలను రక్షించే పేరుతో డబ్బు పొంది చివరికి ఇలా చేస్తారా అంటూ ఎక్కడి కక్కడ బ్యానర్లు, జెండాలు పట్టుకొని ముట్టడి ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఇలా సమాజంలో ఆర్థిక సరక్షోభంతో ప్రభావితులైన వారందరూ రోజు రోజుకూ ఉద్యమంలోకి వస్తున్నారు. విద్యార్థులు విద్య కొనుగోలుకు లక్షకోట్ల డాలర్ల రుణం తీసుకున్నారు. వాటిని తీర్చటానికి ఉద్యోగాలివ్వండి, లేదా రద్దు చేయండి అంటూ వారు జెండాలు పట్టుకున్నారు. అప్పుచేసి కొనుక్కున్న ఇల్లూ పోయింది, ఉన్న ఉద్యోగమూ పోయింది, మేం ఎక్కడకు పోవాలంటూ వీధుల్లో ముట్టడి కేంద్రాల్లో తిష్టవేస్తున్నవారెందరో.