ఉన్నతికి దారి చూపుతూ వస్తావని ఆశిస్తూ... నీకోసం
Popular Posts
-
ఇదుగోనీ పాదపీఠం. ఈ పీఠంపైనీ పాదాలు వుంచు. ఇక్కడపేదలూ, అధములూ,పరిత్యక్తులూ వుంటారు.నేను నీ పాదాలకు నమస్కరించాలనితలవంచినప్పుడునా ప్రణామం...
-
అమర్త్య సేన ఆర్థికాభివృద్ధి రేటును ఎవ్వరూ తీసిపారేయనవసరం లేదు. నేను కూడా ఎప్పుడూ ఆర్థికాభివృద్ధి ప్రాధాన్యతను తీసిపారేయలేదు. అయితే ఆర్థి...
-
చుక్కల్లే తోచావే ఎన్నల్లే కాచావే ఏడబోయావే ఇన్ని ఏల చుక్కల్లో నిన్ను నే నెతికానే ఇన్ని ఏల చుక్కల్లో నిన్ను నే నెతికానే చుక్కల్లే తోచావే ...
-
సామాన్యుడి నుండి సెలబ్రేటీల వరకు బ్లాగ్ బ్లాగ్... సామాన్యుల నుండి సెలబ్రేటీల వరకు నిత్యం తమ భావాలను వెలిబుచ్చడానికి బ్లాగ్‌లను వాడుతున్న...
-
దేశంలో 70% భారతీయులకు రోజుకు రూ.20 ఆదాయం కూడా లేదు. 20 శాతం మంది భారతీయులు కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా తిరుగుతారు. 40 కోట్ల మంది ప్రజలక...
-
పెట్టుబడిదారీ సంక్షోభంపై పెరుగుతున్న ఆగ్రహం పీపుల్స్ డెమొక్రసీ సంపాదకీయం...
-
ఉన్నతికి దారి చూపుతూ వస్తావని ఆశిస్తూ... నీకోసం
-
సురక్షిత నీటి కరువు ప్రజాశక్తి - న్యూయార్క్ Sat, 17 Sep 2011, ...
-
వాల్‌స్ట్రీట్‌లోని కార్పొరేట్లను కాదు ఆదుకోవలసింది మెయిన్‌స్ట్రీట్‌లోని జనాన్ని అన్నదే ముట్టడి ఉద్యమకారుల ప్రధాన డిమాండ్. అమెరికన్లు మ...
Saturday, December 31, 2011
Thursday, December 8, 2011
'ఆక్యుపై వాల్‌స్ట్రీట్'. 1 శాతంపై 99 శాతం చేస్తున్నపోరాటం
Friday, April 8, 2011
చుక్కల్లే తోచావే ఎన్నల్లే కాచావే ఏడబోయావే
చుక్కల్లే తోచావే ఎన్నల్లే కాచావే ఏడబోయావే
ఇన్ని ఏల చుక్కల్లో నిన్ను నే నెతికానే
ఇన్ని ఏల చుక్కల్లో నిన్ను నే నెతికానే
చుక్కల్లే తోచావే ఎన్నల్లే కాచావే ఏడబోయావే
పూసిందే ఆ పూలమాను నీ దీపంలో
దాగిందే నా పేద గుండె నీ తాపంలో
ఊగానే నీ పాటలో ఉయ్యాలై
ఉన్నానే ఈనాటికి నేస్తానై
ఉన్నా ఉన్నాదొక దూరం ఎన్నాళ్ళకు చేరం
తీరందీ తీరం
చుక్కల్లే తోచావే ఎన్నల్లే కాచావే ఏడబోయావే
తానాలే చేసాను నేను నీ స్నేహంలో
ప్రాణాలే దాచావు నీవు నా మోహంలో
ఆనాటి నీ కళ్ళలో సంకళ్ళే
ఈనాటి నా కళ్ళలో కన్నీళ్ళే
ఉందా కన్నీళ్ళకు అర్ధం,ఇన్నేళ్ళుగ వ్యర్ధం
చట్టందే రాజ్యం
చుక్కల్లే తోచావే ఎన్నల్లే కాచావే ఏడబోయావే
ఇన్ని ఏల చుక్కల్లో నిన్ను నే నెతికానే
ఇన్ని ఏల చుక్కల్లో నిన్ను నే నెతికానే
చుక్కల్లే తోచావే ఎన్నల్లే కాచావే ఏడబోయావే
ఇన్ని ఏల చుక్కల్లో నిన్ను నే నెతికానే
ఇన్ని ఏల చుక్కల్లో నిన్ను నే నెతికానే
చుక్కల్లే తోచావే ఎన్నల్లే కాచావే ఏడబోయావే
పూసిందే ఆ పూలమాను నీ దీపంలో
దాగిందే నా పేద గుండె నీ తాపంలో
ఊగానే నీ పాటలో ఉయ్యాలై
ఉన్నానే ఈనాటికి నేస్తానై
ఉన్నా ఉన్నాదొక దూరం ఎన్నాళ్ళకు చేరం
తీరందీ తీరం
చుక్కల్లే తోచావే ఎన్నల్లే కాచావే ఏడబోయావే
తానాలే చేసాను నేను నీ స్నేహంలో
ప్రాణాలే దాచావు నీవు నా మోహంలో
ఆనాటి నీ కళ్ళలో సంకళ్ళే
ఈనాటి నా కళ్ళలో కన్నీళ్ళే
ఉందా కన్నీళ్ళకు అర్ధం,ఇన్నేళ్ళుగ వ్యర్ధం
చట్టందే రాజ్యం
చుక్కల్లే తోచావే ఎన్నల్లే కాచావే ఏడబోయావే
ఇన్ని ఏల చుక్కల్లో నిన్ను నే నెతికానే
ఇన్ని ఏల చుక్కల్లో నిన్ను నే నెతికానే
చుక్కల్లే తోచావే ఎన్నల్లే కాచావే ఏడబోయావే
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ..
పల్లవి:
ఆకాశం ఏనాటిదో
అనురాగం ఆనాటిది |2|
ఆవేశం ఏనాడు కలిగెనొ
ఆనాడే తెలిసిందది |2|
ఆకాశం.. |2|
చరణం 1
ఏ పువ్వు ఏ మోవిదన్నది
ఏ నాడో రాసున్నది
ఏ ముద్దు ఏ మోవిదన్నది
ఏ పొద్దో రాసున్నది
బంధాలై పెన వేయు వయసుకు
ఆందాలే దాసోహమనగ
మందారం విరబూయు పెదవులు
మధువులనే చవి చుడమనగ
పరువాలే ప్రణయాలై
స్వప్నాలే స్వర్గాలై
ఎన్నేన్నో శృంగార లీలలు
కన్నుల్లో రంగేళి అలరెను
చరణం 2
ఏ మేఘం ఏ వాన చినుకై
చిగురాకై మొలకెత్తునో
ఏ రాగం ఏ గుండె లోతున
ఏ గీతం పలికించునో
హృదయాలే తెర తీసి తనువుల
కలబోసి మరపించమనగ
కౌగిలిలో చెర వేసి మదనుని
కరిగించి గెలిపించ మనగ
మోహాలే దాహాలై
సరసాలే సరదాలై
కాలాన్నే నిలవేసి కలలకు
ఇవ్వాలి వెలలేని విలువలు
ఆకాశం ఏనాటిదో
అనురాగం ఆనాటిది |2|
ఆవేశం ఏనాడు కలిగెనొ
ఆనాడే తెలిసిందది |2|
ఆకాశం.. |2|
చరణం 1
ఏ పువ్వు ఏ మోవిదన్నది
ఏ నాడో రాసున్నది
ఏ ముద్దు ఏ మోవిదన్నది
ఏ పొద్దో రాసున్నది
బంధాలై పెన వేయు వయసుకు
ఆందాలే దాసోహమనగ
మందారం విరబూయు పెదవులు
మధువులనే చవి చుడమనగ
పరువాలే ప్రణయాలై
స్వప్నాలే స్వర్గాలై
ఎన్నేన్నో శృంగార లీలలు
కన్నుల్లో రంగేళి అలరెను
చరణం 2
ఏ మేఘం ఏ వాన చినుకై
చిగురాకై మొలకెత్తునో
ఏ రాగం ఏ గుండె లోతున
ఏ గీతం పలికించునో
హృదయాలే తెర తీసి తనువుల
కలబోసి మరపించమనగ
కౌగిలిలో చెర వేసి మదనుని
కరిగించి గెలిపించ మనగ
మోహాలే దాహాలై
సరసాలే సరదాలై
కాలాన్నే నిలవేసి కలలకు
ఇవ్వాలి వెలలేని విలువలు
హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ
యమునా ఎందుకె నువ్వు ఇంత నలుపెక్కినావు..రేయి కిట్టయ్యతోటి కూడావా
యమునా ఎందుకె నువ్వు ఇంత నలుపెక్కినావు..రేయి కిట్టయ్యతోటి కూడావా
నల్లా నల్లని వాడు..నిన్నూ కవ్వించెనా
వలపు సయ్యాటలోనా..నలుపే నీకంటెనా
హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ
వెన్నంటి వెంటాడి వస్తాడే ముచ్చూ
కన్నట్టే గీటేసి పెడతాడె చిచ్చూ (2)
చల్లమ్మ బోతుంటె చెంగట్టుకుంటాడే
చల్లమ్మ బోతుంటె చెంగట్టుకుంటాడే
దారివ్వకే చుట్టూ తారాడుతాడే
పిల్లా పోనివ్వనంటూ చల్లా తాగేస్తడే
అల్లారల్లరివాడు..అబ్బో ఏం పిల్లడే..
హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ
శిఖిపింఛమౌళన్న పేరున్నవాడే..
శృంగార రంగాన కడతేరినాడే (2)
రేపల్లెలోకెల్లా రూపైన మొనగాడె
రేపల్లెలోకెల్లా రూపైన మొనగాడె
ఈ రాధకీడైన జతగాడు వాడే
మురళీలోలుడు వాడే..ముద్దూ గోపాలుడే
వలపే దోచేసినాడే..చిలిపీ శ్రీకృష్ణుడూ..
హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ
యమునా ఎందుకె నువ్వు ఇంత నలుపెక్కినావు..రేయి కిట్టయ్యతోటి కూడావా
నల్లా నల్లని వాడు..నిన్నూ కవ్వించెనా
వలపు సయ్యాటలోనా..నలుపే నీకంటెనా
హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ
యమునా ఎందుకె నువ్వు ఇంత నలుపెక్కినావు..రేయి కిట్టయ్యతోటి కూడావా
యమునా ఎందుకె నువ్వు ఇంత నలుపెక్కినావు..రేయి కిట్టయ్యతోటి కూడావా
నల్లా నల్లని వాడు..నిన్నూ కవ్వించెనా
వలపు సయ్యాటలోనా..నలుపే నీకంటెనా
హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ
వెన్నంటి వెంటాడి వస్తాడే ముచ్చూ
కన్నట్టే గీటేసి పెడతాడె చిచ్చూ (2)
చల్లమ్మ బోతుంటె చెంగట్టుకుంటాడే
చల్లమ్మ బోతుంటె చెంగట్టుకుంటాడే
దారివ్వకే చుట్టూ తారాడుతాడే
పిల్లా పోనివ్వనంటూ చల్లా తాగేస్తడే
అల్లారల్లరివాడు..అబ్బో ఏం పిల్లడే..
హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ
శిఖిపింఛమౌళన్న పేరున్నవాడే..
శృంగార రంగాన కడతేరినాడే (2)
రేపల్లెలోకెల్లా రూపైన మొనగాడె
రేపల్లెలోకెల్లా రూపైన మొనగాడె
ఈ రాధకీడైన జతగాడు వాడే
మురళీలోలుడు వాడే..ముద్దూ గోపాలుడే
వలపే దోచేసినాడే..చిలిపీ శ్రీకృష్ణుడూ..
హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ
యమునా ఎందుకె నువ్వు ఇంత నలుపెక్కినావు..రేయి కిట్టయ్యతోటి కూడావా
నల్లా నల్లని వాడు..నిన్నూ కవ్వించెనా
వలపు సయ్యాటలోనా..నలుపే నీకంటెనా
హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ
తియ్యన్ని దానిమ్మ కొమ్మల్లోనంటా..
చిన్నారి పొన్నారి చిలకల్లా జంటా..
చేస్తున్నా కమ్మని కాపురమూ..
చూస్తున్నా కన్నుల్ల సంబరమూ..
ప్రేమకు మందిరమూ..
||తియ్యన్ని||
ఒక దేహం ఒకప్రాణం తమ స్నేహంగా..
సమభావం సమభాగం తమ పొందుగా..
చిలకమ్మ నెయ్యాలే ఉయ్యాలగా..
చెలికానీ సరసాలే జంపాలగా..
అనురాగం ఆనందం అందాలుగా..
అందాల స్వప్నాలే స్వర్గాలుగా..
ఎడబాసి మనలేని హృదయాలుగా..
ముడిపడ్డ ఆ జంట తొలిసారిగా..
గూడల్లుకోగా పుల్లల్లు తేగా..
చెలికాడు ఎటకో పోగా..
అయ్యో పాపం.. వేచెను చిలకమ్మా..
||తియ్యన్ని||
ఒక వేటగాడెందో వలపన్నగా..
తిరుగాడు రాచిలక గమనించకా..
వలలోనా పడి తాను అల్లాడగా..
చిలకమ్మ చెలికానీ సడికానకా..
కన్నీరు మున్నీరై విలపించగా..
ఇన్నాళ్ళ కలలన్నీ కరిగించగా..
ఎలుగెత్తి ప్రియురాలు రోధించగా..
వినలేని ప్రియుడేమో తపియించగా..
అడివంత నాడు ఆ జంటగోడు..
వినలేక మూగై పోగా...
అయ్యో పాపం.. వేచెను చిలకమ్మా..
||తియ్యన్ని||
చిన్నారి పొన్నారి చిలకల్లా జంటా..
చేస్తున్నా కమ్మని కాపురమూ..
చూస్తున్నా కన్నుల్ల సంబరమూ..
ప్రేమకు మందిరమూ..
||తియ్యన్ని||
ఒక దేహం ఒకప్రాణం తమ స్నేహంగా..
సమభావం సమభాగం తమ పొందుగా..
చిలకమ్మ నెయ్యాలే ఉయ్యాలగా..
చెలికానీ సరసాలే జంపాలగా..
అనురాగం ఆనందం అందాలుగా..
అందాల స్వప్నాలే స్వర్గాలుగా..
ఎడబాసి మనలేని హృదయాలుగా..
ముడిపడ్డ ఆ జంట తొలిసారిగా..
గూడల్లుకోగా పుల్లల్లు తేగా..
చెలికాడు ఎటకో పోగా..
అయ్యో పాపం.. వేచెను చిలకమ్మా..
||తియ్యన్ని||
ఒక వేటగాడెందో వలపన్నగా..
తిరుగాడు రాచిలక గమనించకా..
వలలోనా పడి తాను అల్లాడగా..
చిలకమ్మ చెలికానీ సడికానకా..
కన్నీరు మున్నీరై విలపించగా..
ఇన్నాళ్ళ కలలన్నీ కరిగించగా..
ఎలుగెత్తి ప్రియురాలు రోధించగా..
వినలేని ప్రియుడేమో తపియించగా..
అడివంత నాడు ఆ జంటగోడు..
వినలేక మూగై పోగా...
అయ్యో పాపం.. వేచెను చిలకమ్మా..
||తియ్యన్ని||
Monday, March 28, 2011
బ్లాగంటే ఏమిటి ?
సామాన్యుడి నుండి సెలబ్రేటీల వరకు బ్లాగ్ బ్లాగ్...
సామాన్యుల నుండి సెలబ్రేటీల వరకు నిత్యం తమ భావాలను వెలిబుచ్చడానికి బ్లాగ్‌లను వాడుతున్నారు. అనేక విషయాలపై అందరితో భావాలను పంచుకోవడానికి ఈ బ్లాగ్‌లు ఉపయోగపడుతున్నాయి. 2003లో జరిగిన ఇరాక్ యుద్ధంలో పాల్గన్న సైనికులు యుద్ధ అకృత్యాలను, వారి భావాలను ఈ బ్లాగ్‌లలో వుంచడంతో అమెరికా దుష్ట చర్యలు లోకానికి తెలియవచ్చింది. అలాగే అనేక విషయాలను చర్చించడానికి ఈ బ్లాగ్‌లు ఉపయోగపడుతున్నాయి. మొదట కంప్యూటర్, తరువాత ఇంటర్నెట్, అటు తర్వాత ఈ మెయిల్స్ ఈ వాడకం, ఇప్పుడు బ్లాగ్‌ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. తమకు ఇష్టమొచ్చింది దీనిలో పెట్టుకోవచ్చు. ఒకరికి నచ్చినా, నచ్చకపోయినా పనిలేదు. మంచి చెడులను చర్చించవచ్చు. ఈనాడు వార్తా పత్రికలు, టివీలకన్నా ఈ బ్లాగ్‌లకు ఆదరణ పెరిగింది. నేను ఒక కవిత లేదా కథ వ్రాశాననుకోండి. మాములుగా అయితే దానిని ప్రచురించడానికి ఏ పత్రికకైన పంపాలి. దాని వారు పరిశీలించి ప్రచురణకు యోగ్యమైందో లేదో చూడాలి. యోగ్యమైతే ప్రచురిస్తారు. అనోగ్యమైతే తిప్పి పంపుతారు. ఈ ప్రక్రియ అంతా చాలా కాలం పడుతుంది. అదే బ్లాగ్‌లో అయితే మనము రాసిన వెంటనే పెట్టేయ (పోస్టు) వచ్చు. అందరికీ అందుబాటులో కొద్ది నిముషాలలోనే తీసుకురావచ్చు. అంతటి మహత్తరమైన ప్రక్రియే ఈ బ్లాగ్. అందుకే అనతికాలంలోనే అపరిమితమైన ఆదరణకు నోచుకుంది.
ఒక విధంగా చెప్పాలంటే తెరచిన పుస్తకం. ఎవరైనా చదవచ్చు. తమ అభిప్రాయాలను వెలిబుచ్చవచ్చు. ఇంటర్నెట్ వాడకానికి రాకమునుపు ఎలక్రానిక్ సంభాషణలు, వైర్ సంభాషణలు వుండేవి. అమెచ్యూర్ రేడియోని దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ అమెచ్యూర్ రేడియో యూజర్లు గ్లాగ్ (సైన్‌బోర్గ్‌లాగ్)లు రాసేవారు. ఇవి వ్యక్తిగత డైరీలు. బ్లాగ్ అనే పదం వెబ్‌లాగ్ అనే పదం నుండి వచ్చింది. 1997లో జాన్ బార్జర్ అనే అతను వెబ్‌లాగే అనే పదాన్ని మొట్ట మొదట వాడాడు. వెబ్‌లాగ్ అనే పదాన్ని వె బ్లాగ్ అని పీటర్ మెర్వోల్జ్ తన బ్లాగ్‌లో పెట్టాడు. అలా వెబ్‌లాగ్ పేరు మరుగునపడి బ్లాగ్‌గా వాడకంలోకి వచ్చింది. 1999 సంవత్సరంలో బ్లాగ్ హౌస్టింగ్ కోసం బ్లాగర్ అనే వెబ్‌సైట్ ముందుకొచ్చింది.
బ్లాగ్‌లలో వీడియో బ్లాగ్స్, ఆడియో బ్లాగ్స్, ఫొటో బ్లాగ్స్, మోబ్లాగింగ్స్ వుంటాయి. వీడియో బ్లాగ్స్‌లో మనకు కావలసిన వీడియోలను పెట్టుకోవచ్చు. ఆడియో బ్లాగ్స్‌లో ఆడియోలు వుంచుకోవచ్చు. అలాగే ఫొటో బ్లాగ్స్‌లో మనకు కావలసిన ఫొటోలను పెట్టుకోవచ్చు. మొబైల్ ద్వారా నిర్వహించే బ్లాగ్స్‌ను మోబ్లాగింగ్స్ అంటారు.బ్లాగ్ ఏర్పాటు?
బ్లాగ్‌లను మూడు అంచెలుగా రూపొందించవచ్చు. బ్లాగింగ్ క్లయింట్స్, బ్లాగింగ్ ఫ్లాట్‌ఫారమ్స్, బ్లాగ్ హౌస్ట్. బ్లాగ్ కూడా ఒక వెబ్ పేజీనే. దీనిలో వెబ్ పేజీలో లాగానే అనేకం అప్‌లోడ్ చేసుకోవచ్చు.
బ్లాగింగ్ క్లయింట్స్
బ్లాగింగ్ క్లయింట్స్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌గా లభిస్తాయి. బ్లాగ్.కాంలో ఆన్‌లైన్ బ్లాగ్‌లను తయారుచేసుకోవచ్చు. అన్ని ఫ్లాట్‌ఫారాలతో ఇది మిళితమై వుంటుంది. ప్లాక్‌లాంటివి బ్లాగ్‌ల్లో పోస్ట్ చేయడానికి ఆన్‌లైన్‌లో రూపొందించుకొనే వీలునిస్తాయి. ఇంటర్నెట్‌ను కనెక్ట్‌తో (ఆఫ్‌లైన్‌లో) పనిలేకుండా బ్లాగ్‌లో సమాచారాన్ని రూపొందించవచ్చు. పోస్టు చేయడానికి మాత్రమే ఇంటర్నెట్‌ను ఆన్ చేసుకోవాలి.
బ్లాగింగ్ ఫ్లాట్‌ఫారం బ్లాగ్స్‌ను నిర్మించడానికి ఫ్లాట్‌ఫారమనేది కీలకం. బ్లాగ్‌కు సంబంధించిన విధి విధానాలను దీని ద్వారా చేయవలసి వుంటుంది.
బ్లాగ్ హౌస్ట్మనం తయారు చేసిన సమాచారాన్ని దీని ద్వారా హౌస్ట్ చేయవచ్చు.
ప్రధానంగా పై మూడు బ్లాగింగ్ ప్రధానమైనవి. అవి కాకుండా టెంప్లేట్స్, టెంప్లేట్స్‌లో మార్పులు, లేఅవుట్‌లో మార్పులు, కామెంట్స్, అప్‌లోడింగ్, ట్యాగింగ్ సెర్చ్, ఆర్‌ఎస్‌ఎస్ ఫీడ్స్, పోస్టు చేసుకునేందుకు, కోడ్, బ్లాగ్ ట్రాకర్స్ కూడా వుండేటట్లు చూసుకోవాలి.
బ్లాగ్ టెంప్లేట్స్? బ్లాగ్ ఎలా వుండాలో నిర్దేశించే నమూనా పేజీ. బ్లాగ్ బ్యాక్‌గ్రౌండ్, ఫాంట్ టైప్, కలర్ డెఫినిషన్స్ అనుగుణంగా చూడవచ్చు.
బ్లాగ్ టెక్నికల్ వర్డ్స్
బ్లాగింగ్ : ఏదైనా (ఫొటో, వీడియో, ఆడియో, మ్యాటర్) పోస్టు చేయడం.
బ్లాగర్స్ : పై వాటినే పోస్ట్ చేసే వారినే బ్లాగర్స్.
పోస్టు : మనం దేనినైతే బ్లాగ్ వుంచే దానినే పోస్టు అంటారు.
ఆడియో బ్లాగ్ : ధ్వనితో కూడిన వాటిని వుంచేవి. దీనినే పోడ్కాస్టింగ్ అంటారు.
బ్లెగ్ : చదువురుల నుండి తెలియని విషయాన్ని యాచించడం (అడుక్కోవడం).
విబ్లాగ్ : వీడియో క్లిపింగ్‌లను వుంచేది. దీనినే స్క్రీన్‌కాస్ట్ అంటారు.
బ్లాగ్‌రోల్ : మన బ్లాగ్‌లను ఇతరుల బ్లాగ్‌లకు లింకివ్వడం.
ట్రాక్‌బ్యాక్ : మన బ్లాగ్‌ను ఇతరుల బ్లాగ్ లింక్ చేయడం.
పెర్మాలింక్ : మనకు కావలసిన పోస్ట్‌కి లింక్ చేసి యుఆర్‌ఎల్ ద్వారా సూచించడం.
ఆర్‌ఎస్‌ఎస్ : రిచ్ సైట్ సమ్మరీ (ఆర్‌ఎస్‌ఎస్) అంటే మన బ్లాగ్‌ను ఇతరులకు వేగంగా వచ్చేటట్లు చేయడం.
బ్లాగ్ జంప్ : ఒక బ్లాగ్‌ను మరో బ్లాగ్‌కు జంప్ చేయడం.
బ్లాగ్ సైట్ : బ్లాగ్ వుండే వెబ్‌సైట్.
బ్లాగ్ స్నాబ్ : బ్లాగ్‌పై మీద వారి అభిప్రాయాలకు బదులు ఇవ్వని వారిని బ్లాగ్ స్నాబ్స్ అంటారు.
మోబ్లాగ్ : మొబైల్ బ్లాగింగ్.
కంప్యూటర్ వేగాన్ని కిలోబైట్స్‌లో కొలిచినట్లే సిడి డ్రైవ్ వేగాన్ని 'ఎక్స్'లో కొలుస్తారు
కంప్యూటర్ వేగాన్ని కిలోబైట్స్‌లో కొలిచినట్లే సిడి డ్రైవ్ వేగాన్ని 'ఎక్స్'లో కొలుస్తారు. ఎక్స్ అంటే 150 కిలో బైట్స్ ఫర్ సెకండ్. సిడి డ్రైవ్ యుగానికి దరిదాపు ముగింపు పలికి డివిడి/బ్లూరేలు వచ్చాయి. అయినా సిడి డ్రైవ్ వేగాన్ని గురించి కూడా తెలుసుకుందాం. 52 ఎక్స్ సిడి డ్రైవ్నే ఉదాహరణగా తీసుకున్నామనుకొండి. ఆ డ్రైవ్‌లో సిడి తిరిగే వేగం ఆడియో సిడి వేగానికి 52 రెట్లు ఎక్కవ. ఆడియో సిడిల్లో 210 ఆర్పిఎం (రొటేషన్స్ ఫర్ మినిట్) నుంచి 530 ఆర్పిఎం వేగతంతో తిరుగుతుంది. సిడి వృత్తాకారంలో వుంటుంది దానిలో ట్రాక్‌లు కూడా లోపల నుంచి బయటకు తిరిగే విధంగా వుంటుంది. సిడి ఒకే వేగంతో తిరిగితే హెడ్ సిడి లోపలి భాగంలో (మధ్య భాగానికి దగ్గరగా వున్నప్పుడు) తక్కువ ప్రదేశంలో డేటా రీడ్ చేయబడితే, బయట వృత్తంలో అదే సమయంలో ఎక్కువ డేటాని రీడ్ చేస్తుంది. అలా కాకుండా వుండటానికి సిడి రీడ్ చేసేటప్పుడు ఎక్కువ వేగంతో తిరిగే విధంగా, బయట భాగంలో డేటా రీడ్ చేసేటప్పుడు తక్కువ వేగంతో తిరిగే విధంగా ఏర్పాటు చేయబడింది. దీనినే సిఎల్వి (కన్సటెంట్ లైనర్ విలోసిటీ) అంటారు. ఒక నిర్ణీత సమయంలో హెడ్ ఒకే పొడవుగల ప్రదేశాన్ని రీడ్ చేసేటట్లు చేశారు.
ఆడియో సిడీల్లో హెడ్ లోపలి భాగంలో ఉన్నప్పుడు అది 539 ఆర్పిఎంలో తిరిగితే, బయట భాగంలో ఉన్నప్పుడు 210 ఆర్పిఎంలో తిరుగుతుంది. సిడి అవుట్‌ఫుట్ వేగం సెకన్‌కు 150 కిలోబైట్స్. సిడిలు అతి ఎక్కువగా అంటే 52×210=10,920 ఆర్ఎంపి వేగంతో, అతి ఎక్కువ వేగం అంటే 52×539=28,028 ఆర్పిఎం వేగంతోనూ తిరగవలసి వుంటుంది. ఇంత వేగంతో పనిచేసే స్టెప్పర్ మోటార్లను డిజైన్ చేయడం కష్టం. లోపలి భాగంలో డేటా, బటయ భాగంలోని డేటా ఒకేసారి అవసరమైతే ఆ మోటార్లు స్పీడ్ మారడానికి చాలా సమయం తీసుకుంటాయి. ఇప్పుడు అందుబాటులో వున్న డ్రైవ్‌లు సిఎవి (కన్సెటెంట్ యాంగిలర్ విలోసిటీ) టెక్నాలజీతో పనిచేస్తున్నాయి. ఈ రకమైన సిడి డ్రైవ్‌లో సిడి రీడ్ చేసేటప్పుడు వేగంగా తిరుగుతుంది. సిడి రీడ్ హెడ్ నడిపే మోటారు వేగం మారదు. దీని వలన సిడి రీడ్ చేసేటప్పుడు లోపలి భాగంలోని డేటా తక్కువ వేగంతో, బయట భాగంలో వున్న ఉన్న డేటా ఎక్కువ వేగంతోనూ యాక్సెస్ చేయబడుతుంది.
1980 దశకం చివరిలో డేటా, ఆడియో, వీడియోని వినియోగించుకొనేందుకు సిడి రోమ్లు వచ్చాయి. 1990 దశకంలో అప్పటి వరకు ఆడియో, వీడియో రంగాలకే పరిమితమైన ఇవి కంప్యూటర్ రంగంలోకి కూడా ప్రవేశించాయి. ఇవి రాకమునుపు ప్లాపీ, జిప్ ప్లాపీలను డేటా స్టోరేజికి వినయోగించడం జరిగేది.
మన్నిక, క్వాలిటీ, స్పేస్ రీత్యా వీటి వాడకం పెరిగి ప్లాపీలు కనుమరుగైయ్యాయి. 1995లో డివిడి (డిజిటల్ వీడియో డిస్క్)లు వచ్చాయి. ఇవి సాధారణ సిడి కంటే 13 రెట్ల ఎక్కువ డేటాని స్టోర్ చేయగలవు.
మన్నిక, క్వాలిటీ, స్పేస్ రీత్యా వీటి వాడకం పెరిగి ప్లాపీలు కనుమరుగైయ్యాయి. 1995లో డివిడి (డిజిటల్ వీడియో డిస్క్)లు వచ్చాయి. ఇవి సాధారణ సిడి కంటే 13 రెట్ల ఎక్కువ డేటాని స్టోర్ చేయగలవు.
ఇంటర్నెట్ అనేది అనేక నెట్‌ల కలయిక

మీకు ప్రార్థన చేయడానికి కూడా తీరికలేదా? నో ప్రోబ్లమ్ మీ కోసం ఆన్‌లైన్‌లో ప్రార్థనలు చేస్తాం!
మీరు షాపింగ్ చేయడానికి సమయం చిక్కడంలేదా? మీరు ఇంటి దగ్గర నుండే ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి. మీరు కొనుగోలు చేసిన దానిని మీ ఇంటికే చేరుస్తాం!
మీ బిల్లు ఆన్‌లైన్‌లోనే చెల్లించి సమయాన్ని ఆదా చేసుకోంది! ఇలాంటి ప్రకటనలు ప్రతి నిత్యం చూస్తున్నాము. ప్రతిది ఇంటర్నెట్ మయమైంది. ఈరోజు ఇంటర్నెట్ అంటే తెలియని వారుండరు. ఇది నిత్యావసరమై కూర్చొంది. అదే యువత పెడ మార్గానికి కారణమౌతుంది. ఎక్కడ మంచి వుంటుందో, అక్కడే చెడు కూడా వుంటుందంటారు. చెడును వదలి మంచిని స్వీకరించే తత్వాన్నికి యువత దృష్టిని మరల్చవలసిన అవసరం ఎంతైనా వుంది. 
ఇంటర్నెట్ అనేది అనేక నెట్‌ల కలయిక. విభిన్న రకాల కలయికలు భౌతికంగా ఒక దానితో మరొకటి అనుసంధానించబడి ఒకే పరిభాషలో వ్యవహారాలను నడుపుకోవచ్చు. 

ఇంటర్నెట్ అనగానే మనకు ఠక్కున గుర్తు వచ్చేది బ్లాగ్‌లు. వీటికి 1990లోనే టిమ్ బెర్నర్ అనే శాస్త్రవేత్త మరి కొంతమంది శాస్త్రవేత్తలతో కలిసి యూరోపియన్ పార్టికల్ ఫిజిక్స్ లేబరేటరీలో ఇంటర్నెట్ విప్లవానికి నాంది పలికారు. హైపర్ లాంగ్వేజిని వాడి నేడు వాడుతున్న బ్రౌజర్‌ని పోలివుండే బౌజర్‌ను వాడుకలోకి తెచ్చారు.
Monday, March 7, 2011
ఆర్థికాభివృద్ధి : ప్రజల అభివృద్ధి
అమర్త్య సేన
ఆర్థికాభివృద్ధి రేటును ఎవ్వరూ తీసిపారేయనవసరం లేదు. నేను కూడా ఎప్పుడూ ఆర్థికాభివృద్ధి ప్రాధాన్యతను తీసిపారేయలేదు. అయితే ఆర్థికాభివృద్ధి తనంతట తానే లక్ష్యంగా మారదు. మనం సాధించదల్చుకున్న విలువైన లక్ష్యాలను చేరుకోవటంలో అది సాధనంగా మారుతుంది. అటువంటి విలువైన లక్ష్యాల్లో జీవన ప్రమాణాల పెంపుదల ఒకటి.
ఈ మధ్య ఒక రోజు ఉదయాన్నే ఒక మిత్రుడు ఫోన్ చేశాడు. భారతదేశపు ఆర్థికాభి వృద్ధి గురించి జరుగుతున్న చర్చ చాలా ఆసక్తి కరంగా ఉందని చెప్పాడు. నావల్ల ఒకరు సంతో షపడ్డారన్న విషయం నాకు తృప్తి కలిగించింది. అయితే అతను దేని గురించి మాట్లాడుతున్నాడు అన్న విషయం మాత్రం నాకు అంతుబట్టలేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో భారతదేశ ఆర్థికాభివృద్ధి గురించిన చర్చల్లో నేను జోక్యం చేసుకున్న సందర్భం నాకు గుర్తుకు రాలేదు. అయితే ఈ విషయం గురించి పదే పదే ఫోన్లు, మెయిల్‌లు రావటం మొదలైంది. నేను ఎప్పుడు మాట్లాడాను అన్న విషయం నాకు గుర్తుకు రాకపోవటంతో ఈ మధ్య కాలంలో నేను హాజరైన చర్చలన్నింటినీ నెమరువేసుకోవటం ప్రారంభించాను. ఢిల్లీలో గత సంవత్సరం డిశంబరులో ది ఇండస్ ఎంటర్‌ప్రైజెస్ అన్న సంస్థ నిర్వహించిన ఒక చర్చలో పాల్గంటూ నేను ఇతర రంగాలు, విద్య, వైద్యం, సగటు ఆయుష్షు కాలం వంటి విషయాలు పోల్చి చూడకుండా కేవలం స్థూల జాతీయోత్పత్తి విషయంలో భారతదేశం, చైనాల మధ్య పోలిక పెట్టి చూడటం పిల్ల చేష్ట అని వ్యాఖ్యానించాను. ఈ ఏకవాక్య విమర్శను అనేకమంది విభిన్న రీతిలో వ్యాఖ్యానిస్తున్నారు. అందువల్ల నా విమర్శ గురించి వివరించటం అవసరమని భావిస్తున్నాను.
ప్రజల జీవన ప్రమాణాలు పెంచటం లోనూ, పేదరికాన్ని తగ్గించటంలోనూ స్థూల జాతీయోత్పత్తి తన వంతు పాత్ర పోషిస్తుంద నటంలో సందేహం లేదు. అయితే స్థూల జాతీయోత్పత్తి గురించి చర్చించేటప్పుడు మనం తరచూ గందరగోళపడే అవకాశం ఉంది. ఆర్థికాభివృద్ధి మంచి విషయాలను సాధించ టానికి సాధనంగా ఉండాలన్న విషయానికీ, ఇటువంటి వృద్ధే ఒక లక్ష్యంగా మారటానికీ మధ్య ఉన్న గందరగోళం ఇది. ఆర్థికాభివృద్ధి రేటును ఎవ్వరూ తీసిపారేయనవసరం లేదు. నేను కూడా ఎప్పుడూ ఆర్థికాభివృద్ధి ప్రాధాన్యతను తీసిపారేయలేదు. అయితే ఆర్థికాభివృద్ధి తనంతట తానే లక్ష్యంగా మారదు. మనం సాధించదల్చుకున్న విలువైన లక్ష్యాలను చేరు కోవటంలో అది సాధనంగా మారుతుంది. అటువంటి విలువైన లక్ష్యాల్లో జీవన ప్రమాణాల పెంపుదల ఒకటి.
అదేసమయంలో నా వ్యాఖ్యతో చైనా, భారతదేశ ఆర్థిక వ్యవస్థల మధ్య పోలిక దీర్ఘ కాలంలో కూడా అవసరం లేదన్న అంచనాకు కూడా రావాల్సిన అవసరం లేదు. రెండు దేశాల అభివృద్ధి తీరుతెన్నులు పరిశీలించటానికి ఇది ఒక మంచి కోణం. గతంలో నేను చేపట్టిన అనేక పరిశోధనల్లో ఈ కోణాన్ని వినియో గించాను. జీన్ డ్రీజ్ పరిశోధనల్లో కూడా ఈ కోణం వినియోగంలో ఉంది. చారిత్రక ఆసక్తి రీత్యా చాలా కాలం నుండీ భారత్, చైనాలను పోల్చి చూడటం జరుగుతూ ఉంది. మధ్య యుగాల నాటి చైనా మేధావి వై జింగ్.... భారతదేశంలో ఏమూలనైనా చైనాను మెచ్చుకోని వాళ్లు ఉన్నారా?.... అని ప్రశ్నించాడు. ఏడవ శతాబ్దానికిచెందినవాడుగా భావించబడుతున్న ఈ మేధావి పదేళ్ల పాటు భారతదేశంలో గడిపిన తర్వాత చైనా చేరిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. 691లో ఆయన రాసిన పుస్తకం తొలిసారిగా భారత్, చైనాల గురించి పోల్చి అధ్యయనం చేసింది. ఈ పోలిక ప్రధా నంగా రెండు దేశాల్లో అమల్లో ఉన్న వైద్య విధానాలు, ప్రజారోగ్యానికి పరిమితం అయ్యిం ది. తన పరిశోధనలో భారతదేశం నుండి చైనా ఏమి నేర్చుకోగలదు, చైనా నుండి భారతదేశం ఏమి స్వీకరించగలదు అన్న విషయాలను ఆయన ప్రస్తావించాడు. అటువంటి పోలిక నేటికీ ప్రాధాన్యత కలిగి ఉంది. అటువంటి పోలికల చేయడం ద్వారా మనం నేర్చుకోగలిగిన విష యాల గురించి నేను మరో చోట ప్రస్తావించా ను. (ది ఆర్ట్ ఆఫ్ మెడిసిన్, లెర్నింగ్ ఫ్రం అదర్స్, లాన్సెట్, జనవరి 2011) సమకాలీన అధ్యయనాల్లో చైనా భారత్‌ల మధ్య పోలిక అవసరాన్ని ప్రశ్నించటం కంటే పోలిక కోసం ఎంచుకున్న ప్రమాణాల గురించి కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. ప్రస్తుతం భారత ఆర్థికాభివృద్ధిరేటు కుడిఎడంగా 8 శాతం ఉంది. చైనా సాధిస్తున్న రీతిలో భారతదేశం 10 శాతం వృద్ధి రేటు ఎప్పుడు సాధించగలదు అన్న విషయంపై ఎడతెరిపి లేని చర్చ ఊపిరి బిగబట్టి మరీ జరుగుతోంది. ఆర్థికాభివృద్ధి గురించిన చర్చలో ఎంత ఆసక్తి ఉన్నప్పటికీ గుర్రాల పరుగు పోటీలో పందెం కాయటం వంటి ఈ చర్చ అర్థం లేనిది. కేవలం ఆర్థికాభివృద్ధికి సంబం ధించిన అంచనాల్లో వ్యత్యాసం ఉండటంమొక్కటే నా ఈ అభిప్రాయానికి కారణం కాదు. మొత్తం ఆర్థికాభివృద్ధికి లక్ష్యం ప్రజల జీవితాలను మెరుగుపర్చటం. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటుపెరగ టం వల్ల పరోక్ష ప్రభావంగా ప్రజల జీవితాలు మెరుగయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇక్కడ కొన్ని గణాంకాలు పరిశీలిద్దాం. ఈ గణాంకాలు ప్రపంచ బ్యాంకు రూపొం దించిన ప్రపంచ అభివృద్ధి నివేదిక, ఐక్య రాజ్యసమితి రూపొందింని మానవాభివృద్ధి నివేదికల నుండి సంకలనం చేయబడ్డవి. ఒక వ్యక్తిపుట్టే నాటి అంచనాల మేరకు సదరు వ్యక్తి చైనాలో 73.5 సంవత్సరాలు బతికే అవకా శాలు ఉంటే భారతదేశంలో మాత్రం సదరు వ్యక్తి 64.4 సంవత్సరాలు మాత్రమే బతుకు తాడు. భారతదేశంలో ప్రతి వెయ్యి మందిలో 50 మంది పుట్టిన వెంటనే చనిపోతున్నారు. చైనాలో అలా చనిపోయే వారి సంఖ్య కేవలం 17 మాత్రమే. ఐదేళ్ల లోపు పిల్లలు భారత దేశంలో ప్రతి వెయ్యి మందిలో 66 మంది చనిపోతుంటే చైనాలో అలా చనిపోయే వారి సంఖ్య కేవలం 19 మాత్రమే. చైనాలో నూటికి 94 మంది వయోజనులు అక్షరాస్యులు కాగా భారతదేశంలో వీరి సంఖ్య 65 మంది మాత్రమే. విద్యార్ధులు సగటున చైనాలో 7.5 సంవత్సరాలు విద్యాభ్యాసం చేస్తుంటే భారత దేశంలో కేవలం 4.4 సంవత్సరాలు మాత్రమే విద్యాభ్యాసం చేస్తున్నారు. భారతదేశంలో మహిళల అక్షర్యాసత శాతం పెంచేందుకు చేసిన ప్రత్యేక కృషి వల్ల 15-24 సంవత్సరాల మధ్య ఉన్న మహిళల్లో అక్షరాస్యులైన వారి సంఖ్య పెరిగిన మాట వాస్తవమే. ఈ ప్రత్యేక ప్రయ త్నాల వల్ల మనం సాధించింది 80 శాతం మహిళలను అక్షరాస్యులను చేయటం కాగా చైనాలో 99 శాతం మంది ఉన్నారు. భారతదేశంలో సగానికిపై పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. చైనాలో ఇదే సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య నామ మాత్రం. భారతదేశంలో మొత్తం పిల్లల్లో 66 శాతానికి మాత్రమే డిపిటి టీకాలు వేస్తే చైనాలో 97 శాతం మందికి ఈ టీకాలు వేశారు. ఇటువంటి ప్రయోజనకరమైన అంశాల గురించి చైనాకు, భారతదేశానికి మధ్య పోలిక చూసుకుంటే ఉపయోగంగా ఉంటుంది. ఇటు వంటి పోలిక మనం ఇంకా ఏమి సాధించాలన్న, అందుకు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అన్న విషయం వైపు మనలను ప్రేరేపిస్తుంది. ప్రత్యేకించి మనం అనుసరిస్తున్న నిష్క్రి యాపరత్వం నుండి బయటపడటానికి ఇటు వంటి పోలిక ఉపకరిస్తుంది.
చైనా సాధించిన అత్యధిక వృద్ధి రేటు వల్ల పేదరిక నిర్మూలన, మానవాభివృద్ధికి సంబం ధించిన అనేక సూచికలు మెరుగైన మాట వాస్తవం. అదేవిధంగా సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చటానికీ, అందువల్ల మన్నికైన వృద్ధిరేటు సాధించటానికీ జరిగే ప్రయత్నాలను సమర్థించటానికి మనం వెనకా డాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో భావి తరాల అభివృధ్ధి అవసరాలకు కావల్సినన్ని వనరులు మనం పరిరక్షించాలి. వృద్ధి రేటు గురించిన పిచ్చితో పోలిస్తే మన్నికైన వృద్ధి అన్న భావన మంచిది. అందువల్ల మనం ఏమి చేస్తున్నామన్న విషయంలో మనకు కొంత స్పష్టత ఉండాలి. చైనా సాధించిన తరహాలో వృధ్ది రేటు సాధించాలని పోటీపడటం వెనక ఉన్న ఉత్సాహంలో ఈ స్పష్టత లేదు.
అంతేకాదు, స్థూల జాతీయోత్పత్తి మన దైనిందిన జీవితాలను ప్రతిబింబించే సరైన సూచిక కాదన్న విషయాన్ని కూడా మనం గమనంలోకి తీసుకోవాలి. జీవన ప్రమాణాలు మెరుగపడటం అన్నది మనం ఏమి చేస్తున్నాము, ఏమి చేయటం లేదు అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. కొద్ది సంవత్సరాల క్రితం జీన్ డ్రీజ్ రాసినట్లుగా భారతదేశంలో మానవాభివృద్ధి సూచికలను బంగ్లాదేశ్ మానవాభివృద్ధి సూచిక లతో పోల్చి చూద్దాం. (ది హిందు, సెప్టెంబరు 17, 2004). ఆదాయపరంగా చూస్తే భారత దేశం బంగ్లాదేశ్ కంటే చాలా ముందంజలో ఉంది. భారతదేశ పౌరుడి సగటు తలసరి ఆదాయం 3,250 రూపాయలు అయితే బంగ్లా దేశ్ పౌరుడి సగటుతలసరి ఆదాయం 1550 రూపాయలు మాత్రమే. కానీ ఈ కాలంలో భారతదేశం సాధించిన ఆర్థికాభివృద్ధి రేటు కారణంగా భారతదేశ పౌరుడి తలసరి ఆదా యం బంగ్లాదేశ్ పౌరుల తలసరి ఆదాయం కంటే రెట్టింపుకుపైగా ఉంది. అయితే ఆదాయంలో భారతదేశం సాధించిన ముంద ంజ సామాన్య ప్రజల జీవితాలకు కీలకమైన ఇతర అంశాలను ఏ మేరకు ప్రభావితం చేస్తోం ది? అంతగా ప్రభావితం చేయటం లేదన్నది నా సందేహం.
భారతదేశంలో సగటు ఆయుః ప్రమాణం 64.4 సంవత్సరాలుగా ఉంటే బంగ్లాదేశ్‌లో ఇది 66.9 సంవత్సరాలుగా ఉంది. అంటే భారతదేశ పౌరుడి కంటే బంగ్లాదేశ్ పౌరుడు మరో రెండేళ్లపాటు ఎక్కువ కాలం జీవిస్తాడు. వయసుకు తగ్గ బరువు లేని పిల్లలు భారత దేశంలో (43.5) కంటే బంగ్లాదేశ్‌లో (41.3) తక్కువ. ఫలదీకరణ (ఫెర్టిలిటీ) రేటు కూడా భారతదేశం (2.7) కంటే బంగ్లాదేశ్‌లో (2.3) తక్కువ. పిల్లలు సగటు పాఠశాలకు వెళ్లే సమయం బంగ్లాదేశ్‌లో 4.8 ఏళ్లు అయితే భారతదేశంలో 4.4 ఏళ్లు. పురుషుల అక్షరా స్యత విషయంలో భారతదేశం బంగ్లాదేశ్ కంటే ముందంజలో ఉంది. అయితే మహిళల అక్ష రాస్యతలో బంగ్లాదేశ్, భారతదేశం కంటే ముందంజలో ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బంగ్లాదేశ్‌లో యువతుల అక్షరాస్యత భారతదేశం కంటే ఎక్కువగా ఉంది. విముక్తి చెందిన మహిళలు బగ్లాదేశ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారన్న అంశం ఈ పురోగతి వెనక కీలక కారణంగా ఉంది.
మిగిలిన అన్ని విషయాల కంటే ఆరోగ్యం గురించి అందరికీ శ్రద్ధ ఉంటుంది. ఐదేళ్ల లోపు పిల్లల మరణం భారతదేశంలో ప్రతివెయ్యికి 66గా ఉంటే బంగ్లాదేశ్‌లో అలా చనిపోయే పిల్లలు వెయ్యికి 52 మాత్రమే. పసిపిల్లల మరణాల్లో కూడా బంగ్లాదేశ్‌దే ఆధిపత్యం. అక్కడ వెయ్యికి 41 మంది మాత్రమే చనిపో తుంటే భారతదేశంలో 52 మంది పిల్లలు చనిపోతున్నారు. బంగ్లాదేశ్‌లో 99 శాతం పిల్లలకు అంటువ్యాధులు రాకుండా టీకాలువేస్తే భారతదేశంలో మాత్రం 66 శాతం మందికి మాత్రమే టీకాలు వెయ్యగలిగాము. భారతదేశం సాధించిన తలసరి ఆదాయంలో సగానికంటే తక్కువ తలసరి ఆదాయం కలిగి ఉన్న బంగ్లాదేశ్ ప్రజల దైనందిన జీవితానికి సంబంధించిన విషయాల్లో ఎంతో పురోగతి సాధించింది.
ఈ విషయాలు ప్రస్తావిస్తున్నంత మాత్రాన ఆర్థికాభివృద్ధి రేటు పెరిగితే బంగ్లాదేశ్‌లో సామాజిక అభివృద్ధి సూచికలకు పెద్దగా ప్రయోజనం ఉండదన్న నిర్ధారణకు రావటం పొరపాటు అవుతుంది. కేవలం ఆర్థికాభివృద్ధి సాధించటమే లక్ష్యంగా అనుకోవటం కంటే అటువంటి వృద్ధి రేటు సాధించటం ద్వారా మరింత మంచి పనులు సాధించవచ్చు అన్న దృష్టి ఉంటే పెరుగుతున్న వృద్ధి రేటు ఫలాలు సామాజిక అభివృద్ధిలో ప్రతిఫలిస్తాయి. బంగ్లాదేశ్‌లో తలసరి ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ ఈ మాత్రం సామాజిక అభివృద్ధి సాధించగలగటం వెనక ప్రభుత్వేతర సంస్థల పాత్ర కీలకంగా ఉంది. వీటితో పాటు ప్రభుత్వ విధానాల్లో ప్రాధాన్యతలు కూడా కారణం. అయితే మరింత ఎక్కువ ఆదాయం, మెరుగైన ప్రభుత్వ వనరుల కేటాయింపు ద్వారా ప్రజలకు మేలు చేయాలన్న బంగ్లాదేశ్ ప్రభుత్వ శక్తి సామర్ధ్యాలు మరింతగా పెంచవచ్చు.
ఆర్థికాభివృద్ధి రేటు గొప్పదనం ఏమిటంటే ప్రభుత్వ ప్రాధాన్యతలకనుగుణంగా వెచ్చించ టానికి అవసరమైన నిధులను, వనరులను సమకూర్చుకునే అవకాశం ప్రభుత్వానికి ఇది కల్పిస్తుంది. స్థూలజాతీయోత్పత్తి కంటే వేగంగా ప్రభుత్వ వనరులు పెరుగుతాయి. స్థూల జాతీయోత్పత్తి 7-8 శాతం చొప్పున పెరుగు తుంటే ప్రభుత్వ వనరులు 9-12 శాతం చొప్పున పెరుగుతాయి. 1990-1991 భారత ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం కంటే నేడు పన్నుల ద్వారా వచ్చే ఆదాయం నాలుగు రెట్లు ఎక్కువ. అంటే స్థిరీకరించబడిన ధరలతో పోలిస్తే స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు కంటే ఇది ఎక్కువ.
సామాజిక రంగం అని పిలిచే రంగంపై , విద్య, వైద్య రంగాల్లో కేంద్ర ప్రభుత్వం వెచ్చించే వ్యయం ఈ కాలంలో పెరిగిందన్నది నిస్సం దేహం. ఇది సంతోషించాల్సిన విషయం. అయినప్పటికీ మనం ఇంకా అనేక రంగాల్లో చైనా కంటే వెనకబడే ఉన్నాము. వైద్యరంగంలో చైనాలో ప్రభుత్వ వ్యయం భారతదేశంలో ప్రభుత్వ వ్యయం కంటే ఐదురెట్లు ఎక్కువ. భారతదేశపు తలసరి ఆదాయం కంటే చైనా తలసరి ఆదాయం ఎక్కువే అన్నది నిజమే. చైనా తన స్థూల దేశీయోత్పత్తిలో రెండు శాతం వైద్యరంగ అవసరాలపై వెచ్చిస్తుంటే భారతదేశం కేవలం ఒక్క శాతం మాత్రమే వెచ్చిస్తోంది.
భారతదేశంలో వైద్య రంగంపై ప్రభుత్వ వ్యయం నామమాత్రంగా ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వైద్య అవసరాల కోసం ప్రధానంగా ప్రైవేటు ఆసుపత్రులపై ఆధార పడుతున్నారు. ఈ ప్రైవేటు వైద్యుల్లో చాలా మందికి వైద్యవిద్యలో ప్రాథమిక జ్ఞానాన్ని మించిన పరిజ్ఞానం ఉండదు. శిక్షణ ఉండదు. ఆరోగ్యం విషయంలో సమాచారం ఇచ్చి పుచ్చుకోవాలి. వైద్యులు ఏ తరహా మందులు ఇస్తున్నారో కనీసం తెలుసుకునే హక్కు రోగులకు ఉంటుంది. కానీ ప్రైవేటు ఆసుపత్రులపై ఆధారపడ్డప్పుడు రోగులను మోసగించటానికి పుష్కలమైన అవకాశాలు ఉంటాయి. 'ప్రతిచి' ట్రస్టు నిర్వహించిన అధ్యయనంలో రోగుల అమా యకత్వాన్ని ఆసరా చేసుకుని వారికి అవసరం లేని వైద్యం అంటగట్టి డబ్బులు గుంజుతున్న వైనం వెల్లడైంది. ప్రాథమిక వైద్య సదు పాయాలను ప్రైవేటీకరించే ప్రయత్నంలో నాటువైద్యం, తాంత్రికవైద్యం వంటివాటికి కూడా స్థానం కలిగింది. దీంతో కేవలం అమానుషమైన దోపిడీయే కాదు, దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రాథమిక వైద్య సదుపాయాలు కూడా అందు బాటులోకి రావటం లేదు.
ఇక్కడ కీలకమైన అంశం ఏమిటంటే జీవన ప్రమాణాలు పెంపొందించటానికి ఆర్థికాభివృద్ధి అవసరమే. అయితే ఆర్థికాభివృధ్ధి ఏమేరకు ప్రజలకు చేరుతుందన్న విషయం మనం ఆ అభివృద్ధితో ఏమి సాధించాలనుకుంటున్నా మన్నదానిపై ఆధారపడి ఉంటుంది. గణనీ యమైన సంఖ్యలో ఉన్న కొందరికి అభివృద్ధి అభివృద్ధి కోసమే అన్నది వాస్తవం. ఎందుకంటే వారు సంపన్నవంతులు. సామాజిక సహ కారంతో నిమిత్తం లేకుండానే జీవించగలవారు. అటువంటి వారికి ఆర్థికాభివృద్ధితో పాటే అవకాశాలూ పెరుగుతుంటాయి. అటువంటి అవకాశాలు మంచివే. ఆర్థికాభివృద్ధితో అటు వంటి అవకాశాలు మెరుగుపర్చుకోవటంలో తప్పేమీ లేదు. ఎందుకంటే సంఖ్యాపరంగా అటువంటి సంపన్నులు భారతదేశంలో గణ నీయంగానే ఉన్నారు. అయితే తరచూ మీడియాలో కనిపించే వారి విలాసవంతమైన జీవితాలు దేశ వాస్తవికతను ప్రదర్శించవు.
బహుశా ఈ సంపన్నవంతులు తరచూ ఆర్థికాభివృద్ధి సాధిస్తే అన్నీ సాధించినట్లే అన్న పొరపాటు అభిప్రాయానికి లోనయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆర్థికాభివృద్ధి నేరుగా వారి సంపద విలువను పెంచుతుంది. దీనికోసం అదనంగా వారు కష్టపడాల్సింది ఏమీ లేదు. ఇటువంటి పరిస్థితుల వల్ల వారు ఒకరకమైన ప్రత్యేక తరగతిగా మారిపోతారు. దేశంలో అత్యధిక ప్రజానీకం ఎదుర్కునే కష్టనష్టాలను పదే పదే గుర్తుచేసే సామాజిక కార్యకర్తలను 'జోలె తగిలించుకుని తిరుగుతారు' అని వీళ్లు ఎద్వేవా చేయడం నేను తరచూ వింటున్నాను. ఈ సామాన్య ప్రజలే దేశానికి బాసట. వాస్త వానికి మెజారిటీ భారతీయుల జీవితాల్లో మెరుగుదల రానంతవరకూ మనం ఏమి సాధిం చినా లెక్కలోకి రాదు. ఏమీ సాధించనట్లే లెక్క.
సంపన్నవంతుల లోగిళ్లలో లెక్కకు రాని ముడితరహా సమస్యలు ఉంటాయన్న విషయాన్ని ప్రస్తావిస్తే సామాజిక అసమానతల గురించి మాట్లాడేవారు నిరాశచెందుతారేమో. అటువంటి అత్యుత్సాహంతో భారతదేశం నిజంగా సాధిం చాల్సినవీ, ప్రజలకు మరింతగా అందిం చాల్సినవీ అందించలేకపోతున్నామని, సాధిం చలేకపోతున్నామని నా ఆందోళన. సరైన చర్యలు తీసుకుంటే ఆర్థికాభివృద్ధి వల్ల ప్రజలకు మరింత ప్రయోజనం ఒనగూడేలా చేయొచ్చు. అందువల్ల అభివృద్ధి యొక్క పాత్ర, విలువ గురించి మరింత స్పష్టత కలిగి ఉండటం ప్రయోజనకరం.
ఇదుగోనీ పాదపీఠం.
ఇదుగోనీ పాదపీఠం.
ఈ పీఠంపైనీ పాదాలు వుంచు.
ఇక్కడపేదలూ, అధములూ,పరిత్యక్తులూ వుంటారు.నేను నీ పాదాలకు నమస్కరించాలనితలవంచినప్పుడునా ప్రణామం ఈ అధోజగత్తులోవుండే నీ పాదాలనుస్పృశించ లేదు.
నిరుపేదవలె,అధమాధమునివలె,పరిత్
తోడునీడ లేని పతితలోకంలో నీవు ఉన్నచోటికినా హృదయంవెతుక్కుంటూ రాగలదా?
...... గీతాంజలి నుంచి
Subscribe to:
Comments (Atom)



