ప్రపంచ కోటీశ్వరుల జాబితాలో ఇండియా
* సర్వేలో వెల్లడైన వాస్తవాలు
* ఆస్తి పరులపై సర్వే చేసిన మెరిల్ లించ్ వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థ
* పది లక్షల డాలర్ల కంటే ఎక్కువగా పెట్టుబడి పెట్టినవారిపైనే దృష్టి
* 12 వ స్థానంలో ఇండియా
* భారత్‌లో కోటీశ్వరుల సంఖ్య 1,53,000 మంది
* గతేడాది 1,26,700 మంది
పేదల నిలయం భారత్ అన్నది పాత మాట. అత్యధికంగా కోటీశ్వరులు కలిగిన దేశాల జాబితాలో భారత్ 12 వ స్థానంలో నిలిచినట్లు ఓ సర్వే సంస్థ తేల్చింది. ఇండియాలో లక్ష్మీ పుత్రుల జాబితా ప్రతి సంవత్సరం పెరుగుతోందని నివేదికలో వెల్లడైంది. ప్రపంచ పేద దేశాలలో భారత్ ఒక్కటిగా ఉన్నా క్రమేణా సంపన్న దేశాల జాబితా చేరనుందా..అంటే అవుననే అంటున్నాయి సర్వే సంస్థలు. ఇటీవల ఇండియాలో కోటీశ్వరుల సంఖ్య పెరుగుతోందని వరల్డ్‌వైడ్ కోటీశ్వరుల సంఖ్యపై మెరిల్ లించ్ వెల్త్ మేనేజ్‌మెంట్, క్యాంప్ జెమినీ నిర్వహించిన సర్వేలో తేలింది.* ఆస్తి పరులపై సర్వే చేసిన మెరిల్ లించ్ వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థ
* పది లక్షల డాలర్ల కంటే ఎక్కువగా పెట్టుబడి పెట్టినవారిపైనే దృష్టి
* 12 వ స్థానంలో ఇండియా
* భారత్‌లో కోటీశ్వరుల సంఖ్య 1,53,000 మంది
* గతేడాది 1,26,700 మంది
గత ఏడాది దేశంలో కోటీశ్వరుల సంఖ్య గణనీయంగా పెరిగి భారత్ లక్ష్మీపుత్రుల నిలయంగా మారుతోందని నివేదిక ప్రకటించింది. పది లక్షల డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టగలిగిన ఆస్తిపరులను సర్వే పరిగణనలోకి తీసుకుంది. అత్యధిక సంఖ్యలో కోటీశ్వరులు కలిగిన దేశాల జాబితాలో భారత్ 12వ స్థానంలో నిలవడం ఇదే ప్రథమం. దీని ప్రకారం దేశంలో కోటీశ్వరుల సంఖ్య లక్షా యాభై మూడు వేల మందికి పెరిగింది. 2009 సంవత్సరంలో ఆ సంఖ్య లక్షా ఇరవై ఆరు వేల ఏడు వందల మంది మాత్రమే.
భారత్‌లో కుబేరుల సంఖ్య పెరగడంతో యూరఫ్‌ను అధిగమించి ఆసియా పసిఫిక్ రెండో ప్రాంతంగా నిలిచిందని 2010 ఏడాదికి చెందిన వార్షిక ప్రపంచ సంపద నివేదిక పేర్కొంది. ౩1 లక్షల నాలుగు వేల మంది కుబేరులతో అమెరికా ప్రధమ స్థానంలో ఉండగా జపాన్, జర్మనీ, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, ఇటలీ బ్రెజిల్, భారత్ తరువాతి స్థానాలను ఆక్రమించాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో జపాన్, చైనా తర్వాత భారత్‌లోనే లక్ష్మీపుత్రుల సంఖ్య అధికమని నివేదిక తేల్చింది. విలాసవంతమైన కార్లు, విమానాల కొనుగోలుపై భారత్ సంపన్నుల్లో ఆసక్తి పెరిగిందని కూడా నివేదిక వెల్లడించింది.
ప్రపంచ కోటీశ్వరుల్లో అమెరికా, జపాన్, జర్మనీల వాటా 53 శాతం కావడాన్ని నివేదికలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న బారత్ సంపన్న దేశాల జాబితాలో చేరుతుండటంతో ఆర్థిక వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
No comments:
Post a Comment